కలం, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) డైరెక్షన్‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కి మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భోగి పండుగ సందర్బంగా బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అల్లు అర్జున్ తన తరువాత సినిమా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తో చేస్తున్నట్లు ప్రకటిస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.
ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh) మ్యూజిక్ అందిస్తున్నట్లుగా.. 2026 లోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. లోకేష్ కనగరాజ్ ఏడవ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. పుష్ప 2 వంటి భారీ హిట్ తరువాత అల్లు అర్జున్ తమిళ్ డైరెక్టర్స్‌తోనే మూవీ చేస్తుండటం గమనార్హం. అలాగే త్వరలో ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో బన్నీ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.

Read Also: దడపుట్టిస్తున్న గోల్డ్ ధరలు.. పెళ్లిళ్ల సీజన్ లో తిప్పలు
Follow Us On : WhatsApp


