కలం, వెబ్ డెస్క్: ప్రజలను కన్ఫ్యూజ్ చేసేందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి కొత్తపార్టీలు పుట్టుకొస్తున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) పేర్కొన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో వివాదాలు ముదరడం వల్లే కవిత కొత్త పార్టీని పెట్టుకున్నారని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత పార్టీపై వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. కుటుంబంలో నెలకొన్న వివాదాల కారణంగానే కవిత సొంత కుంపటి పెట్టుకున్నదని బీజేపీ విమర్శిస్తోంది. కేసీఆర్ ఉద్దేశ్యపూర్వకంగానే ఆమెతో పార్టీ పెట్టించారని మరికొందరు నేతలు అంటున్నారు. సోషల్ మీడియాలో కవితపార్టీపై చర్చ జరుగుతోంది. కవితకు వ్యతిరేకంగా అనుకూలంగా కొందరు పోస్టులు పెడుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ మీదే చర్చ జరుగుతోంది.
Read Also: ఇన్‌స్టాంట్స్.. స్నాప్‌చాట్‌కు పోటీగా కొత్త యాప్!
Follow Us On: Instagram

