Mobile Popup Ad
Mobile Popup Ad

సోష‌ల్ మీడియా కేసులు.. పులివెందుల‌లో స‌జ్జ‌ల భార్గ‌వ విచార‌ణ‌

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలో మ‌రోసారి సోష‌ల్ మీడియా కేసుల అంశం తెర‌పైకి వ‌చ్చింది. తాజాగా మ‌రోసారి వైసీపీ సోష‌ల్ మీడియా కో ఆర్డినేట‌ర్‌ స‌జ్జ‌ల భార్గ‌వ రెడ్డి (Sajjala Bhargava Reddy)ని పోలీసులు విచార‌ణ‌కు పిలిచారు. పులివెందుల డీఎస్పీ ఆఫీస్‌లో సజ్జల భార్గవ రెడ్డి విచారణ జ‌రుగుతోంది. డీఎస్పీ ముర‌ళీ నాయ‌క్ భార్గ‌వ్‌ను విచారిస్తున్నారు. రెండు సోష‌ల్ మీడియా కేసుల్లో గ‌తంలో భార్గ‌వకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఏ1 గా వ‌ర్రా ర‌వీంద‌ర్‌ రెడ్డి, ఏ2గా భార్గ‌వ రెడ్డి ఉన్నారు. ముగ్గురు సీఐలు, ఇద్ద‌రు ఎస్ఐల స‌మ‌క్షంలో విచార‌ణ కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. వీడియో రికార్డింగ్ చేస్తూ విచార‌ణ చేస్తున్న‌ట్లు స‌మాచారం. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ల‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టుల‌ నేప‌థ్యంలో ఈ కేసులు న‌మోద‌య్యాయి.

Read Also: ఏసీ అతి వాడకంతో ఆరోగ్యానికి ముప్పు.. ఈ జాగ్రత్తలు మస్ట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>