Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజలకు వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య

కలం, యాదగిరిగుట్ట: ప్రజలకు వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు స్టేజ్ వద్ద నూతనంగా నిర్మించిన బస్టాండ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ బస్టాండ్‌ను దివంగత గుంటుకు యశోదమ్మ యాదగిరి రెడ్డి జ్ఞాపకార్థం జనగాం ఉపేందర్ రెడ్డి సొంత నిధులతో నిర్మించారని అయిలయ్య (MLA Beerla Ilaiah) అన్నారు. ప్రజలకు ఉపయోగపడేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గ్రామీణులకు ఎండ, వర్షాలకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బస్టాండ్‌లు ఉపయోగపడతాయని తెలిపారు.

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆస్తులను, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా నిర్మించిన వసతులను సంరక్షించుకోవాలని ఉంచాలని అయిలయ్య పిలుపునిచ్చారు. దాతృత్వంతో ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాన్ని అందించిన జనగాం ఉపేందర్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, దాత కుటుంబ సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>