కలం, వెబ్ డెస్క్ : తన మీద బాగా కావాల్సిన వారే కుట్ర చేశారని నటుడు శివాజీ (Shivaji) సంచలన ఆరోపణలు చేశారు. తనతో పాటు కెరీర్ మొదలు పెట్టిన వారికి తన మీద చాలా కోపం ఉందని.. దాన్ని ఇలా తీర్చుకున్నారని తెలిపాడు. హీరోయిన్ల బట్టల మీద శివాజీ చేసిన కామెంట్స్ ఎంత పెద్ద రచ్చకు దారి తీశాయో మనకు తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటికే మహిళా కమిషన్ (Women’s Commission) ముందు విచారణకు సైతం హాజరయ్యాడు శివాజీ. తాజాగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారదకు వివరణ పత్రం శివాజీ అందించాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తన మీద కొందరు కుట్ర చేశారని.. తాను ఆ కామెంట్లు చేసిన తర్వాత వారందరూ జూమ్ మీటింగ్ పెట్టుకుని తనను ఎలా ఇబ్బంది పెట్టాలో ప్లాన్ చేశారని ఆరోపించాడు.
‘నేను ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశంతో అలా మాట్లాడలేదు. జాగ్రత్తలు చెప్పాలనే ఉద్దేశంతోనే అన్నాను. దాన్ని రకరకాలుగా ప్రచారం చేశారు. ఈ విషయంలో నేను ఆల్రెడీ సారీ కూడా చెప్పాను’ అంటూ శివాజీ (Shivaji) వివరించాడు. దీంతో ఆయనపై ఎవరు కుట్ర చేశారా అనే చర్చలు మొదలయ్యాయి. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్లు అందం చూపించేలా బట్టలు వేసుకోవద్దంటూ కొంచెం ఘాటుగానే కామెంట్ చేశాడు శివాజీ. ఇప్పటికే అనసూయ, నిధి అగర్వాల్, చిన్మయి, నాగబాబు, ప్రకాశ్ రాజ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
Read Also: దృశ్యం-3లో డైరెక్టర్, హీరో మధ్య డిఫరెన్స్
Follow Us On: X(Twitter)


