epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫుట్‌బాల్ క్లబ్‌కు షాక్.. ఎంబెప్పేకు నష్టపరిహారం

కలం, డెస్క్: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ క్లబ్‌ పారిస్ సెంట్ జర్మైన్ (PSG)కు ఆ దేశ లేబర్ కోర్ట్ భారీ షాక్ ఇచ్చింది. దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ ఎంబెప్పే(Mbappe) చెల్లించాల్సిన బకాయి ఫీజు 60-61 మిలియన్ యూరోలు అంటే సుమారు రూ.554 కోట్లకు పైగా చెల్లించాలని తెలిపింది. దాంతో పాటుగానే క్లబ్‌కు జరిమానా కూడా విధించింది. ఎంబెప్పే బకాయిల విషయంలో కొంతకాలంగా కోర్టు విచారణ జరుగుతోంది. ఇందులో తాజాగా ఫ్రాన్స్ లేబర్ కోర్టు చెల్లించని జీతాలు, బోనసుల విషయంలో ఎంబాపేకు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువడింది.

ఈ మొత్తంలో 55 మిలియన్ యూరోలు(Euros) జీతాల బకాయి, మరో 6 మిలియన్ యూరోలు సెలవుల భత్యాలుగా కోర్టు స్పష్టం చేసింది. అయితే ఎంబెప్పే ఒప్పందానికి సంబంధించిన ఇతర ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. కానీ ప్రధాన ఆర్థిక డిమాండ్‌పై మాత్రం PSGకు గట్టి షాక్ ఇచ్చింది. 2024లో రియల్ మాడ్రిడ్‌కు వెళ్లిన ఎంబెప్పే(Mbappe).. PSG తనను పక్కన పెట్టి మానసిక ఒత్తిడికి గురి చేసిందని ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో తాజా తీర్పు ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కోర్టు తీర్పుపై PSG ఇప్పటివరకు స్పందించలేదు. అప్పీల్ చేస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఎంబాపే న్యాయవాదులు మాత్రం “ఫుట్‌బాల్ అయినా.. చట్టం చట్టమే” అంటూ తీర్పును స్వాగతించారు. ఎంబాపే తరఫు న్యాయవాదులు మాత్రం కోర్టు తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ రంగంలో కూడా కార్మిక చట్టాలు అందరికీ వర్తిస్తాయన్న సత్యాన్ని ఈ తీర్పు మళ్లీ నిరూపించింది” అని వారు పేర్కొన్నారు.

26 ఏళ్ల ఎంబాపే, తన ఒప్పందానికి సంబంధించి PSG తప్పుడు ఫ్రెంచ్ చట్టపరమైన వర్గీకరణను వర్తింపజేసిందని కూడా ఆరోపించాడు. అయితే ఈ అంశాన్ని కోర్టు తిరస్కరించింది. లేబర్ కోర్టు తుది నిర్ణయం ప్రకారం, చెల్లించాల్సిన మొత్తం లో 55 మిలియన్ యూరోలు జీతాల బకాయిలు, సుమారు 6 మిలియన్ యూరోలు సెలవుల భత్యాలుగా ఉంటాయని వెల్లడించింది. PSG తరఫున ఏడు సీజన్లు ఆడిన ఎంబాపే, 308 మ్యాచ్‌ల్లో 256 గోల్స్ చేశాడు. అనంతరం ఫ్రీ ట్రాన్స్‌ఫర్‌పై రియల్ మాడ్రిడ్‌కు వెళ్లాడు. ప్రస్తుతం అక్కడ ఆయనకు సంవత్సరానికి సుమారు 30 మిలియన్ యూరోలు జీతం లభిస్తున్నట్లు సమాచారం.

Read Also: విదేశీ ఆటగాళ్లపై బీసీసీఐ కొత్త క్యాప్ రూల్.. అసలదేంటంటే..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>