కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా పరిధిలో నిషేధిత చైనా మాంజా (Chinese Manja) విక్రయిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా మాంజా అమ్ముతున్న వారిపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా, మెదక్ టౌన్‌లో చైనా మాంజాను విక్రయిస్తున్న గోపీ మధు అనే వ్యక్తిపై, అదేవిధంగా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహ్మద్ అబేద్ మరియు స్వప్న అనే కిరాణా షాప్ యజమానులపై కేసులు నమోదు చేయడం జరిగింది. నిషేధిత చైనా మాంజా విక్రయం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని, ముఖ్యంగా చిన్నారులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని, చైనా మాంజా విక్రయం, నిల్వ, రవాణా వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Read Also: హుస్నాబాద్‌ను తిరిగి కరీంనగర్‌లో కలుపుతాం: మంత్రి పొన్నం కామెంట్స్
Follow Us On : WhatsApp


