కలం, ఖమ్మం బ్యూరో: భారతీయ సమాచార విప్లవంలో ధ్రువతారగా వెలుగొందుతున్న ‘ఆకాశవాణి’ (Akashvani) 90 వసంతాల అపూర్వ మైలురాయిని చేరుకుంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ‘వాయిస్ ఆఫ్ నేషన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొత్తగూడెం (Kothagudem) ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో ‘3కే వాకతాన్’ ఉత్సాహంగా సాగింది. జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ టి.భరత్ ఈ వాకతాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా సమాచార వారధిగా ఆకాశవాణి (Akashvani) అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. కార్యక్రమంలో స్టేషన్ ప్రోగ్రామ్ హెడ్ కొలిపాక శంకర రావు మాట్లాడుతూ ఆకాశవాణి ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు, విద్యావేత్తలకు నిరంతరం వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతోందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, తుఫానుల సమయంలో ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేడియో అభిమానులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read Also: ‘విజయ్ అనే నేను..’ రేపే సీఎంగా ప్రమాణ స్వీకారం
Follow Us On: WhatsApp

