మాకు హిందూ, ముస్లిం భేదాభిప్రాయం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్ హౌస్‌ లో హజ్ యాత్రికుల బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, యాత్రకు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమకు హిందూ, ముస్లిం భేదాభిప్రాయం లేదని, హిందూ ముస్లిం భాయీ భాయీ అని వ్యాఖ్యానించారు. సంక్షేమంలో మైనారిటీల వాటాను వారికి అందిస్తున్నామని స్పష్టం చేశారు.

గత ఏడాది హజ్ యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో 44 మంది మృతి చెందారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రతి మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇచ్చి ఆయా కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. ఉద్యోగాలలో, సంక్షేమ పథకాలలో మైనారిటీలకు దక్కాల్సిన వాటాను వారికి అందిస్తున్నామన్న సీఎం.. విదేశీ విద్య విషయంలోనూ మైనారిటీలకు స్కాలర్షిప్ లు అందిస్తున్నామని స్పష్టం చేశారు. వైట్ కాలర్ జాబ్స్ కంటే ప్రస్తుతం బ్లూ కాలర్ జాబ్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా కంటే జర్మనీ, జపాన్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అందుకే ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసి యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.

హజ్ యాత్రికులకు సీఎం రేవంత్ భరోసా..

ప్రస్తుతం ఇరాన్, ఇరాక్ యుద్ధంతో విమాన ఇంధన ఛార్జీలు పెరిగాయని, దీంతో విమాన ప్రయాణం ఛార్జీలు పెరిగాయని వివరించారు. అయితే హజ్ యాత్రికులపై ఎలాంటి భారం పడకుండా ఆ భారాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో చాలామంది మైనారిటీ సోదరులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ ఆటోగా మార్చాలని నిర్ణయించామని వెల్లడించారు. దీంతో ఆటో డ్రైవర్లకు డబ్బులు ఆదా అవుతాయని పేర్కొన్నారు.

SIR పేరుతో భారీ కుట్ర..

SIR పేరుతో తెలంగాణలో ఓట్లు తొలగించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు మన రాష్ట్రంలో జరగనివ్వద్దని పిలుపునిచ్చారు. మనందరం కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలని సూచించారు. సంక్షేమం అభివృద్ధిలో మైనారిటీల వాటా వారికి అందిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని కోరారు.

Read Also: ‘విజయ్ అనే నేను..’ రేపే సీఎంగా ప్రమాణ స్వీకారం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>