కలం కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర కార్యదర్శి టేకుమళ్ల సమ్మయ్య (Tekumalla Sammaiah) విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఔట్ సోర్సింగ్ విధానం రద్దు చేస్తామని, వర్క్ షాపులు అభివృద్ధి చేస్తామని, ఇలా రకరకాల వాగ్దానాలు ఇచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు సుముఖత చూపడం లేదని మండిపడ్డారు. ఆర్టీసీ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని యెడల పరిష్కారం అయ్యే వరకు ఆర్టీసీ కార్మికులతో ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కరీంనగర్ (Karimnagar) 1,2 డిపోలలో సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్దేశించి టేకుమల్ల సమ్మయ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, జిల్లా కార్యదర్శిలు పిట్టల సమ్మయ్య, పిట్టలశ్రీనివాస్‌లతో పాటు ఆర్టీసీ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము కొమురయ్య యాదవ్, బెజ్జంకి కాళిదాస్, ఎంఆర్ రెడ్డి, పిజె రెడ్డి, ఎన్.పద్మ,కె.వసంత, పి.జ్యోతి, కె.విమల, రాజమణి, జయప్రద, బొజ్జ సాయిలు, ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: భారత నౌక దిగ్బంధనం.. ఇరాన్ మళ్లీ షాక్!
Follow Us On: Instagram

