Mobile Popup Ad
Mobile Popup Ad

ఏఐ ఫోటోలు, ఫోర్జరీ సంతకాలతో ఫేక్ రిజిస్ట్రేషన్

కలం మెదక్ బ్యూరో: టెక్నాలజీను దుర్వినియోగం చేస్తూ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. భూ యజమానికి తెలియకుండా ఏఐ టెక్నాలజీతో భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన ఘటన సిద్దిపేట (Siddipet) జిల్లాలో వెలుగుచూసింది. సిద్ధిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన గ్యార మల్లేష్ అనే వ్యక్తి గత రెండేళ్లుగా బోన్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ, కీమో థెరపీకి కూడా శరీరం సహకరించక మంచానికే పరిమితమైయాడు. 2023లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో శ్రీమంతుల రామచంద్రం అనే వ్యక్తి నుండి ఎకరం భూమిని మల్లేష్ కోనుగోలు చేశాడు.

అయితే భూ భారతి ఆపరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది మార్చి 4వ తేదీన గ్యార మల్లేష్ సంతకం లేకుండా, ఫోటో దిగకుండానే టి.అభిలాష్ అనే వ్యక్తి పేరిట అతని భూమి రిజిస్టర్ చేశాడు. అనంతరం మార్చి 10వ తేదీన రేణుజ అనే మహిళ పేరిట రిజిస్టర్ చేశాడు. తన క్యాన్సర్ చికిత్స కోసం భూమి అమ్ముకుందామని చూడగా ఈ ఏఐ ఫోర్జరీ ఉదంతం బయటపడింది. ఏఐ సహాయంతో సంతకాలు ఫోర్జరీ చేసి, ఫోటోలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు బాధితులు గుర్తించారు. తన వైద్యానికి ఇప్పటికే రూ.40 లక్షలు ఖర్చు అయిందని, ఆ భూమి అమ్మకపోతే తాను బతకనని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని సహాయం చేయాలని బాధితుడు కోరాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>