కలం, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం వారణాసి మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి చాలా సమయం పట్టొచ్చు. ఈ సినిమా తర్వాత మహేశ్ ఏం చేయబోతున్నాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే రాజమౌళి మూవీతో సొంతమయ్యే ప్రపంచ మార్కెట్‌ను ఏ హీరోనైనా నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో రాజమౌళితో సినిమాలు చేసిన ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా క్రేజ్ సంపాదించి, అంతే స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 2026లోనే మహేష్ బాబు వారణాసి (Varanasi) ప్రధాన షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత పోస్ట్-ప్రొడక్షన్ పనులు కొనసాగుతాయి. వారణాసి తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేయడానికి అనేకమంది నిర్మాతలు లైన్‌లో ఉన్నారు. వారణాసి తర్వాత మహేశ్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. కానీ మహేశ్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఆయన నెక్ట్స్ మూవీని తన సొంత GMB ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్ నాటికి మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. సరైన సబ్జెక్ట్, దర్శకుడి కోసం ఇప్పట్నుంచే వెతికే పనిలో పడ్డారు. పరిస్థితులు అనుకూలిస్తే, వారణాసి విడుదలైన కొద్ది గ్యాప్‌లోనే ఈ మూవీని పట్టాలెక్కించనున్నాడు.
Read Also: నాపై కుట్ర చేశారు.. నటుడు శివాజీ సంచలన ఆరోపణలు
Follow Us On: X(Twitter)


