కలం, వెబ్ డెస్క్: తమిళ ప్రజలు పొంగల్ సీజన్‌ను సెంటిమెంట్‌గా భావిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ పండుగ సీజన్‌లో ప్రేక్షకులను అలరించడానికి ఒక్క తమిళ సినిమా (Kollywood) లేదు. జన నాయగన్ వాయిదా తర్వాత పరాశక్తి మూవీ చివరి నిమిషంలో ఆగిపోయింది. అలాగే కార్తీ వా వాతియార్ అన్యూహంగా ఆగిపోయింది. సినిమా నిర్మాత ఫైనాన్షియర్‌కు రూ. 21 కోట్ల బకాయిలను చెల్లించని కారణంగా మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బకాయిలు క్లియర్ అయ్యే వరకు, థియేటర్లు, OTT డిజిటల్‌తో సహా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో సినిమా విడుదలను కోర్టు శాశ్వతంగా నిలిపివేసింది.
ఎట్టకేలకు ఒక రోజు ముందు పరాశక్తి సెన్సార్ సర్టిఫికేట్ అందుకుంది. ప్రస్తుతానికి తమిళంలో (Kollywood) మాత్రమే విడుదల అవుతోంది. ఆందోళనకరమైన విషయం ఏమింటే ఈ మూవీకి నెగిటివ్ టాక్ వస్తే.. భారీ కలెక్షన్లు సాధించకపోవచ్చు. అలాగే ఇతర రాష్ట్రాల ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతుంది. జన నాయగన్ విషయానికి పొంగల్ సెలవుల తర్వాత జనవరి 21న జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ సినిమా క్లిష్టమైన దశలో ఉంది. ఈ సంక్షోంభంతో తమిళ్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
Read Also: ప్రభాస్ రాజాసాబ్ జోరు.. ఫస్ట్ డే 54 కోట్లు కలెక్షన్స్
Follow Us On : WhatsApp


