అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు : కాంగ్రెస్ నేత అరెస్టు !

కలం, వెబ్‌ డెస్క్‌ : హైదరాబాద్‌ను కుదిపేసిన అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ (Advocate Khaja Moizuddin) హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ దారుణ హత్య వెనుక కాంగ్రెస్ నేత ఆలం ఖాన్, ఆయన కుమారుడి హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులిద్దరినీ శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వక్ఫ్ బోర్డు భూముల వివాదమే ఈ ఘాతుకానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

ఖాతా ముగించేందుకు రూ. 25 లక్షల భారీ సుపారీ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. గత రెండేళ్లుగా మొయిజుద్దీన్‌ను (Khaja Moizuddin) అంతమొందించేందుకు నిందితులు వ్యూహాలు రచించారు. ఇందులో భాగంగా ఏకంగా 10 సార్లు హత్యకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు మే 23న లాయర్ తన ఇంటి నుంచి బయటకు రాగానే కారుతో బలంగా ఢీకొట్టి, ప్రమాదంగా చిత్రీకరించి పరారయ్యారు. సాంకేతిక ఆధారాల సాయంతో విచారణ జరిపిన పోలీసులు, నిందితుల గుట్టు రట్టు చేశారు.

Read Also: ప్రేయసిని కలవడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఫిట్‌నెస్ ట్రైనర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>