Mobile Popup Ad
Mobile Popup Ad

భారీగా కల్తీ అల్లం పేస్ట్ పట్టివేత

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు (Patancheru) పరిధిలోని శ్రీ నగర్ కాలనిలో భారీగా కల్తీ అల్లం పేస్ట్ పట్టుకున్నారు. పటాన్ చెరు, శేరిలింగంపల్లి ఎస్వోటీ పోలీసుల సంయుక్త దాడుల్లో కల్తీ అల్లం పేస్ట్ తయారీ భాగోతం బయటపడింది. మురిగిపోయిన అల్లం, ఎల్లిపాయ పొట్టు, కెమికల్స్ వాడి కల్తీ అల్లం తయారు చేస్తూ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. 535 కేజీల కల్తీ అల్లం పేస్ట్ తో పాటు, 900 కేజీల అల్లం పొట్టుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ దందాను నిర్వహిస్తున్న ముంబైకి చెందిన అస్లాం ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గత ఏడాదిగా కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తూ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Read Also: శర్వానంద్ ‘బైకర్’కు ప్రభాస్ ప్రమోషన్.. వింటేజ్ లుక్ అదిరిందిగా

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>