చామనపల్లి హత్య కేసులో 15 మందికి యావజ్జీవ కారాగార శిక్ష

కలం, కరీంనగర్ బ్యూరో : గత కొన్నేళ్ల క్రితం కరీంనగర్ (Karimnagar) రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చామనపల్లి (Chamanpalli) గ్రామంలో జరిగిన బోజ్జ తిరుపతి హత్య కేసులో న్యాయం నిలిచింది. కరీంనగర్ జిల్లా  సెషన్స్ కోర్టు ఈ కేసులో 15 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది. ప్రతీ నిందితుడికి రూ.1,500 జరిమానా కూడా విధించింది.

కేసు నేపథ్యం

2019 ఏప్రిల్ 19న చామనపల్లి (Chamanpalli) గ్రామం పొలిమేరలో ఈ దారుణ ఘటన జరిగింది. గ్రామ మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్న బోజ్జ తిరుపతి (48), కొంతమంది సభ్యులను చేపల వేట హక్కుల నుంచి తొలగించడంతో వారిలో కక్ష పెరిగింది. ఈ కక్షతో ప్రధాన నిందితుడు మయాకల ధర్మరాజం (A1)తో పాటు మరో 14 మంది కలిసి పథకం ప్రకారం తిరుపతిపై దాడి చేశారు. రాళ్లతో కొట్టి, అనంతరం తువాలుతో గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతుడి భార్య బోజ్జ సమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శాస్త్రీయ ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలను సమగ్రంగా సేకరించి కోర్టులో సమర్పించారు.

శిక్ష పడిన నిందితులు

ఈ కేసులో మయాకల ధర్మరాజం, మయాకల రాములు, మయాకల పోచయ్య, మయాకల కొమురయ్య, మయాకల అంజయ్య, మయాకల వెంకటేశం, మయాకల నవీన్, మయాకల ప్రవీణ్, మయాకల శ్రీనివాస్ (కొమురయ్య కుమారుడు), మయాకల శ్రీనివాస్ (రాములు కుమారుడు), మయాకల సంపత్, మయాకల లచ్చయ్య, మయాకల సత్తయ్య, మయాకల శ్రీనివాస్ (వెంకటేశం కుమారుడు), మయాకల వెంకట్రాజంలకు శిక్ష పడింది

పోలీసుల కృషికి ప్రశంసలు

కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు ఇన్‌స్పెక్టర్ కె. శశిధర్, ఎస్‌హెచ్‌ఓ ఏ. నిరంజన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. ప్రతాప్, తదితరులను పోలీస్ కమిషనర్ అభినందించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయడంలో వారి కృషి కీలకమని పేర్కొన్నారు.

Read Also: గడ్చిరోలిలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>