గణపయ్యను దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ (Adilabad) పట్టణంలోని వివిధ గణేష్ మండపాల్లో ప్రతిష్టించిన వినాయకులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం రాత్రి దర్శించుకున్నారు. శ్రీ సాయి రాజ్ గణేష్ మండల్, శ్రీ బాల గోపాల అక్షిత్ గణేష్ మండల్, ఎలక్ట్రానిక్ మీడియా గణేష్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గణపయ్యకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, బొజ్జ గణపయ్య ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు కలెక్టర్, ఎస్పీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, గణేష్ మండళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>