ముధోల్‌కు భారీగా నిధులు.. ఎమ్మెల్యే పవార్ రామారావు ప్రకటన

కలం, ముధోల్ : ముధోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గ్రామపంచాయతీ, అంగన్వాడీ, ఫెడరేషన్ భవనాలు, వర్క్‌షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Mudhole MLA) ప్రకటించారు. కుంటాల మండల కేంద్రంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు, లోకేశ్వరం మండలం బామ్నీ (కె) లో జీపీ భవనానికి రూ.20 లక్షలు, థర్మోరా, జోహార్‌పూర్, లోకేశ్వరం, మన్మధ్, పంచగుడి, పుస్పూర్ గ్రామాల్లో అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.12 లక్షలు, రాజేష్ తండాలో ఫెడరేషన్ భవనానికి రూ.10 లక్షలు, వర్క్‌షెడ్‌కు రూ.10 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

రాజురా, వటోలి గ్రామాల్లో అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.12 లక్షలు కేటాయించారని, ముధోల్ మండలం వడ్తల్‌లో గ్రామపంచాయతీ, ఫెడరేషన్ భవనాల నిర్మాణానికి చెరో రూ.10 లక్షలు, బోరిగాం గ్రామంలో రెండు వర్క్‌షెడ్ల నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయని అన్నారు. నర్సాపూర్ మండలం బామ్నీ (బి), నందన్ గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.10 లక్షలు, నందన్‌లో అంగన్వాడీ భవనానికి రూ.10 లక్షలు, బాసర మండలం దోడపూర్‌లో గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలు, బాసర, శారదానగర్‌లో ఫెడరేషన్ భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.10 లక్షలు, భైంసా మండలం గుండెగాం, హాజ్గుల్, కుంబి, లింగా గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.

తిమ్మాపూర్‌లో అంగన్వాడీ భవనానికి రూ.12 లక్షలు, దేగాంలో వర్క్‌షెడ్, ఫెడరేషన్ భవనాల నిర్మాణానికి చెరో రూ.10 లక్షలు, కుభీర్ మండలం బెల్గం తండాలో అంగన్వాడీ, వర్క్‌షెడ్, ఫెడరేషన్ భవనాల నిర్మాణానికి మొత్తం రూ.32 లక్షలు, ఫాఖీర్ నాయక్ తండా, చాతలో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.20 లక్షలు, దావుజీ నాయక్ తండా, దొడర్నా, న్యూ సాంవ్లీ, రంగ శివిని, శివుని తండా, వీరేగాం తండాల్లో అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ.12 లక్షలు, సిరిపెల్లి, వీరేగాం తండాల్లో వర్క్‌షెడ్లు, ఫెడరేషన్ భవనాల నిర్మాణానికి కూడా నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ నిధులతో గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు గ్రామపంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>