కలం, వెబ్డెస్క్: పోక్సో కేసులో చంచల్గూడ జైలు (Chanchalguda Jail)లో రిమాండ్ ఖైదీ (Prisoner)గా ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి (22) జైలు నుంచి పరారై సొంత ఊరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కిషోర్ కుమార్ రెడ్డి అనారోగ్యానికి గురవడంతో మంగళవారం చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రి సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. బుధవారం నాటికి వనపర్తి జిల్లా అమరచింతలోని తన సొంతూరు నందిమల్లకు చేరుకున్నాడు. అయితే, అప్పటికే అక్కడ పోలీసులు గస్తీ తిరగడం గమనించిన కిషోర్ కుమార్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.
ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక ఊరి చెరువు గట్టుపై ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గతేడాది జూలై 6న మహబూబ్నగర్ జిల్లా జైలు నుంచి కూడా కిషోర్ కుమార్ రెడ్డి పరారయ్యాడు. అదే రోజు పోలీసులు అతడిని పట్టుకొని చంచల్గూడ జైలుకు తరలించి రిమాండ్లో ఉంచారు. కిషోర్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

