కలం, వెబ్ డెస్క్ : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ (Actress Rambha) (అసలు పేరు యూదీ విజయలక్ష్మి) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని రంభ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ”నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాన్నా.. మీరు లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు” అంటూ ఆమె భావోద్వేగ పోస్టు చేశారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.
కాగా, విజయవాడకు చెందిన రంభ 1990 వ దశకంలో తన అందంతో, డ్యాన్స్ తో స్టార్ హీరోస్ అందరితో నటించింది. ఈ క్రమంలోనే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రంభ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ ఆమెకు ఇప్పటికీ భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కష్ట సమయంలో రంభ కుటుంబానికి ధైర్యం కలగాలని అభిమానులు, సినీ ప్రముఖులు అంటున్నారు.

