ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్‌తో యుద్ధవిరమణ ముగింపు వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో ఒప్పందం అర్థవంతంగా ఉంటుంది.. లేదా ఒప్పందమే ఉండదని తెలిపారు. సోమవారం తన సోషల్ మీడియా ఖాత ట్రూత్ సోషల్ లో ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. మధ్యవర్తుల ద్వారా తాము ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నామని.. ఒప్పందం ఇంకా కుదరలేదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ ఒప్పుకుంటేనే చర్చలు ముందుకు వెళ్తాయన్నారు.

ప్రస్తుతం చర్చలు సాఫీగా సాగుతున్నాయని.. గల్ఫ్ దేశాల అధినేతలతో కూడా సంప్రదింపులు కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. అంతకుముందు, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, ఇరాన్, అమెరికా చర్చలు ముగింపు దశకు వచ్చాయని పేర్కొన్నారు. కానీ, యుద్ధం ముగింపుపై ఇప్పుడే సంతకం చేయబోమని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>