హనీరోజ్‌కు చేదు అనుభవం.. నడుమును తాకి ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్

కలం, వెబ్ డెస్క్: సినిమా హీరోయిన్లు షాపింగ్ మాల్స్, ఇతర ప్రారంభోత్సవాలకు హాజరైనప్పుడు అభిమానుల తాకిడి సహజమే. అయితే గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సెల్ఫీ కోసం, తమ అభిమాన నటిని దగ్గరగా చూడాలనే ఆత్రుతతో కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. హీరోయిన్ల ఒంటిపై చేయి వేస్తూ ఇబ్బందులకు గురిచేయడం లాంటి ఘటనలెన్నో వైరల్ అయ్యాయి. బాడీగార్డ్స్, పోలీసులు ఉన్నప్పటికీ అభిమానుల తాకిడి కారణంగా హీరోయిన్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ బ్యూటీ హనీరోజ్‌కు (Honey Rose)  చేదు అనుభవం ఎదురైంది.

కేరళ (Kerala)లో మాల్ ఓపెనింగ్‌కు హనీరోజు హాజరైంది. ఓపెనింగ్ తర్వాత అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. కొందరు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానుల్లో కొందరు ఆమె (Honey Rose) నడుము తాకుతూ ఇబ్బంది పెట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Read Also: న‌టుడు ప్రకాశ్ రాజ్ ఇంట్లో తీవ్ర‌ విషాదం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>