Mobile Popup Ad
Mobile Popup Ad

ఏసీబీకి దొరికిపోయిన మహిళా సీఐ, ఎస్సై

కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ పై (Women Police Station) ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా మహిళా సీఐ సరోజ, ఎస్సై రాణిని రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్నట్లు వివరించారు. బాధితుడు, కౌన్సిలర్ గా పనిచేస్తున్న ఇర్షాద్ పై మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే, తన కుటుంబ సమస్యను తప్పుదారి పట్టించి సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేయడమే కాకుండా, స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా సమాచారంతో డీఎస్పీ ఆధ్వర్యంలో రైడ్ చేసి సీఐ, ఎస్సైని పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు.

Read Also: ఏపీ టూరిజంపై నీతి ఆయోగ్ నివేదిక

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>