ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu)కి భారీ ఊరట దక్కింది. ఆయన మీద నమోదైన లిక్కర్ కేసు క్లోజ్ అయ్యింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు మీద లిక్కర్ స్కామ్ కేసు( Liquor Case) నమోదైంది. ఈ కేసులో అప్పటి సీఐడీ చంద్రబాబును ఏ3గా చేర్చింది. కాగా, తాజాగా ఈ కేసు దర్యాప్తు ముగిస్తున్నట్టు సీఐడీ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఐదు మద్యం కంపెనీలను మంజూరు చేశారంటూ వైసీపీ హయాంలో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని కేవలం కక్ష సాధింపుతోనే అప్పటి ప్రభుత్వం కేసు నమోదు చేసిందని టీడీపీ నేతలు ఇంతకాలం చెబుతూ వచ్చారు. తాజాగా ఈ కేసులో చంద్రబాబుకు ఊరట దక్కింది.
సహజంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద కేసులు నమోదు కావడం.. ఆ తర్వాత అవి వీగిపోవడం చూస్తూనే ఉంటాము. గతంలో చాలా మంది రాజకీయ నేతల మీద ఇటువంటి కేసులు నమోదయ్యాయి. అయితే అనుకూల ప్రభుత్వాలు వాటిని కొట్టేయడం.. పక్కన పెట్టేయడం.. లేదంటూ ముగించడం జరుగుతూ ఉంటుంది. తాజాగా చంద్రబాబు నాయుడు (Chandrababu) కేసు కూడా ఇలాగే ముగిసిపోయింది.
Read Also: ఐపీఎస్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కులాల మధ్య చిచ్చు పెట్టడానికేనా?
Follow Us on: Facebook


