Mobile Popup Ad
Mobile Popup Ad

రంగనాయక సాగర్‌ను పరిశీలించిన అబుదాబి ప్రతినిధుల బృందం

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా చిన్నకోడూరు మండలం చందులాపూర్ సమీపంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన రంగనాయక సాగర్ (Ranganayaka Sagar) రిజర్వాయర్‌ను అబుదాబి ప్రతినిధుల బృందం పరిశీలించింది. హైదరాబాద్ నుండి హెలికాప్టర్‌లో అబుదాబి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా హుమైద్ సైఫ్ అల్ జర్వాన్ అల్ షమ్సీ ఆధ్వర్యంలో ఐదు మంది సభ్యుల బృందం సిద్దిపేటకు చేరుకుంది.

అబుదాబికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రతినిధుల బృందం రంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను, టన్నెల్ లోపల ఉన్న మోటర్లను పరిశీలించింది. రిజర్వాయర్‌కు సంబంధించిన వివరాలను ఇరిగేషన్, ఇంధన శాఖ, ఇతర అధికారులు అబుదాబి ప్రతినిధుల బృందం వివరించారు.

Read Also: తమ తప్పిదాలకు ప్రజలను శిక్షిస్తున్న మోదీ సర్కార్: సిద్దరామయ్య

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>