Mobile Popup Ad
Mobile Popup Ad

హ‌రీశ్ రావు అరెస్ట్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: గురుకులాల్లో టెండ‌ర్ల‌పై (Gurukul School Tenders) మంత్రుల‌తో చ‌ర్చ‌కు బ‌య‌లుదేరిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు (Harish Rao)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయ‌న‌తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్దే హ‌రీశ్ రావును పోలీసులు అడ్డుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. పోలీసులు తీరుపై హ‌రీశ్ రావు, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చ‌ర్చ‌కు పిలిచి అడ్డుకోవ‌డం ఏమిట‌ని మంత్రుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందని, డ్రగ్స్​ సప్లయర్లకు టెండర్లు ఇచ్చారని హ‌రీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కార్య‌క‌ర్త‌లు, పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన తోపులాట‌లో హ‌రీశ్ రావు కింద ప‌డిపోయారు.

అనంత‌రం పోలీసులు హ‌రీశ్ రావు (Harish Rao) స‌హా ప‌లువురు బీఆర్ఎస్ నేత‌ల‌ను అదుపులోకి తీసుకొని త‌మ వాహ‌నంలోకి ఎక్కించారు. అరెస్ట్​ అనంతరం హరీశ్​ రావును కంచన్​బాగ్​ స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా హరీశ్​ రావు మాట్లాడుతూ… మంత్రి జూపల్లి నిన్న తెలంగాణ భవన్​కు వస్తానని చెప్పారని, శాలువా కప్పి ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన గన్​పార్క్​ డ్రామా ఎందుకు షురూ చేశారని మండిపడ్డారు. జూపల్లి (Minister Jupally) కోసం కేటీఆర్​ తెలంగాణ భవన్​లో ఎదురు చూస్తున్నారని, వెళ్లి చర్చలో పాల్గొనాలని సూచించారు.

Read Also:  తెలంగాణ – కర్నాటక.. బోర్డర్‌లో ‘చెత్త’ పంచాయితీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>