Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్ దారిలో వీడీ.. పినరయి విజయన్‌ను కలిసిన సతీశన్

కలం, వెబ్‌డెస్క్ : తమిళనాడు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన టీవీకే చీఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేరళకు కాబోయే సీఎం వీడీ సతీశన్ (VD Satheesan) కూడా అదే దారిలో నడిచాడు. అపద్దర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా విజయన్ వీడీ సతీశ్ కు పినరయి శుభాకాంక్షలు తెలియజేశారు.

కేరళ నూతన ముఖ్యమంత్రిగా సీనియర్ నేత వీడీ సతీశన్ (VD Satheesan) ను కాంగ్రెస్ అధిష్ఠానం గురువారం ప్రకటించింది. కాంగ్రెస్ జాతీయ నాయకుడు కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల, వీడీ సతీశన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాగా, ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించగా అధిష్టానం వీడీ సతీశన్ ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే సతీశన్ పినరయి విజయన్ ను కలిసి రాష్ట్ర రాజకీయాలు, సంక్షేమంపై చర్చించారు.

Read Also: తమ తప్పిదాలకు ప్రజలను శిక్షిస్తున్న మోదీ సర్కార్: సిద్దరామయ్య

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>