ఆసుపత్రి నుంచి అభిషేక్ బెనర్జీ డిశ్ఛార్జి

కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై (Abhishek Banerjee) దాడి ప్రకంపనలు రేపుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్పూర్ ప్రాంత పర్యటనకు వెళ్లిన అభిషేక్‌పై గుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. బీజేపీ కార్యకర్తలే దీనికి కారణమని అభిషేక్ ఆరోపిస్తుంటే.. బీజేపీ మాత్రం ఖండిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ ఘటన జరిగాక స్వల్పంగా గాయపడిన అభిషేక్‌ను స్థానికంగా అపోలో ఆసుపత్రిలో చేర్పించగా, ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి బయట మాట్లాడుతూ.. దాడి వెనుక ముమ్మాటికీ బీజేపీనే ఉందన్నారు. తన పోరాట స్ఫూర్తిని ఎవరూ ఎదురించలేరని స్పష్టం చేశారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు తమను భయటపెట్టలేవని సవాల్ విసిరారు. బీజేపీ గూండాయిజంపై ఎంతవరకైనా పోరాడుతామన్నారు. కాగా, తన మేనల్లుడిపై దాడిని మమతా బెనర్జీ సైతం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>