Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మల్ యువకుడికి ఆర్మీలో ఉద్యోగం.. ఎమ్మెల్యే అభినందనలు

కలం, నిర్మల్: యువత దేశ సేవ కోసం ఆర్మీలో చేరేందుకు ముందుకు రావాలని ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) పిలుపునిచ్చారు. నిర్మల్ (Nirmal) జిల్లా బైంసా మండలంలోని దేగాం గ్రామానికి చెందిన మహాగాం సంతోష్ ఆర్మీ ఉద్యోగానికి ఎంపిక కావడంతో ఆదివారం బైంసా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను అభినందించి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్మీలో సేవ చేసే అవకాశం దక్కడం గొప్ప అదృష్టమని, దేశ భద్రత కోసం సేవ చేయడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో దేగాం సర్పంచ్ సిరం సుష్మరెడ్డి, సీనియర్ నాయకులు బోయిడి విఠల్, బద్దం గంగారెడ్డి, చంద్రకాంత్ పటేల్, భోజరాం పటేల్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>