టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)కు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra)ఓ కీలక సూచన చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో గంభీర్ చాలా ఆగ్రహంగా మాట్లాడటం మంచిదికాదని, అలాంటి వైఖరి విమర్శల దారితీస్తుందని తన అభిప్రాయం వెల్లడించారు. దక్షిణాఫ్రికాతో విశాఖపట్నంలో డిసెంబర్ 6న జరిగిన మూడో వన్డేలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో గంభీర్ పాత్రికేయులపై, అలాగే ఒక ఫ్రాంచైజీ యజమాని వ్యాఖ్యలపై తీవ్రమైన స్పందన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై తాజాగా ఆకాష్(Aakash Chopra)స్పందించారు. “గౌతమ్ గంభీర్ వచ్చి చాలా ఫైరీగా మాట్లాడాడు. అది అతని స్టైల్… అతను మనసులో ఉన్నదే మాట్లాడతాడు. కానీ అతనికి నేనో సలహా, సూచన ఇవ్వాలనుకుంటున్నా. ఇలా ఆగ్రహంగా స్పందిస్తే, మీరు ఎదుటి వారి దృష్టిని మీ వైపు తిప్పుకుంటారు. అప్పటి నుంచి ప్రజలు మీరు ఎప్పుడు తప్పు చేస్తారా! అని ఎదురు చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇలా మాట్లాడటం వల్ల మీరు మీకే విమర్శలను ఆహ్వానించుకున్నట్లు అవుతుంది” అని ఆకాష్ అన్నారు.
గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అతని నేరుగా, ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడే తీరు చర్చనీయాంశంగా మారింది. ఇక చోప్రా వ్యాఖ్యల తర్వాత… గంభీర్ తన స్టైల్‌లో మార్పులు చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
Read Also: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్
Follow Us On: Pinterest


