కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమయింది. మంగళవారం న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ జట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) తన అంచనాలను వెల్లడించారు. గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ అందుబాటులో లేకపోవడంతో విదేశీ ఆటగాళ్ల ఎంపిక పంజాబ్‌కు సవాలుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సీజన్‌లో పంజాబ్ రూ. 3 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కూపర్ కానోలీ తుది జట్టులో ఉండే అవకాశం ఉందని చోప్రా పేర్కొన్నారు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా సూచనల ప్రకారం అతను కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కావాలని, బౌలింగ్ చేయకూడదని చోప్రా వివరించారు. మిచెల్ ఓవెన్ కంటే కానోలీకే ప్రాధాన్యత దక్కవచ్చని ఆయన విశ్లేషించారు.
జట్టులో మార్కో జాన్సెన్, మార్కస్ స్టోయినిస్ స్థానాలు ఖాయమని చోప్రా తెలిపారు. నాలుగో విదేశీ ఆటగాడిగా బెన్ ద్వార్షుయిస్ కంటే జేవియర్ బార్ట్లెట్‌కు అవకాశం ఇవ్వాలని సూచించారు. అవసరమైతే అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను కూడా బార్ట్లెట్ స్థానంలో పరిశీలించవచ్చని చెప్పారు.
గత సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్ల అద్భుత ప్రదర్శనతో పంజాబ్ రన్నరప్‌గా నిలిచిందని చోప్రా (Aakash Chopra) గుర్తు చేశారు. ఈసారి కూడా ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్ వంటి దేశవాళీ ఆటగాళ్లే జట్టుకు వెన్నెముకగా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీరితో పాటు శ్రేయస్ అయ్యర్ మధ్యలో కీలకం కానున్నారని పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత మైదానంలోకి వస్తున్న యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌ను చూడటానికి తాను ఆసక్తిగా ఉన్నానని చోప్రా తెలిపారు. పంజాబ్ జట్టు సమతూకంతో ఉందా లేదా అనేది నేటి మ్యాచ్‌తో తేలనుంది.
ఆకాష్ చోప్రా అంచనా వేసిన పంజాబ్ జట్టు:
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, కూపర్ కానోలీ/మిచెల్ ఓవెన్, మార్కో జాన్సెన్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్/జేవియర్ బార్ట్లెట్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్.
Read Also: జైస్వాల్‌లో కాసేపు కోహ్లీ కనిపించాడు: ఆకాష్ చోప్రా
Follow Us On : WhatsApp

