ఆర్‌సీబీ ఖాతాలో మరో టైటిల్ పక్కా: అశ్విన్

కలం, వెబ్ డెస్క్: రానున్న రెండేళ్లలో మరోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా ఆర్‌సీబీ నిలవడం పక్కా అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ (Ashwin) జోస్యం చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న మూడేళ్ల ఐపీఎల్ సైకిల్‌లో ఆర్సీబీ అత్యంత పటిష్టమైన జట్టుగా కనిపిస్తోందని అశ్విన్ విశ్లేషించారు. మెగా వేలానికి ముందు కేవలం విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, రజత్ పాటిదార్‌లను మాత్రమే అట్టిపెట్టుకున్న ఆర్సీబీ, వేలంలో తెలివైన నిర్ణయాలు తీసుకుందని అశ్విన్ ప్రశంసించారు. ఫిల్‌సాల్ట్, జితేష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్లను జట్టులోకి తెచ్చుకోవడం ద్వారా లోపాలను సరిదిద్దుకుందని అభిప్రాయపడ్డారు.

ఈ జట్టు టాప్-2లో నిలిచేందుకు అన్ని అర్హతలు కలిగిన ప్యాకేజీ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా తొలి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం ఆర్సీబీకి ఒక రకంగా మంచిదేనని అశ్విన్ విశ్లేషించారు. హేజిల్‌వుడ్ లేని సమయంలో ఫిల్ సాల్ట్ , జాకబ్ బెథెల్ ఇద్దరినీ తుది జట్టులో ఆడించే అవకాశం దక్కుతుందని, దీనివల్ల జట్టు బలం పెరుగుతుందని ఆయన వివరించారు. హేజిల్‌వుడ్ తిరిగి వచ్చే సమయానికి జట్టు కూర్పుపై ఒక స్పష్టమైన అవగాహన వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆర్సీబీ వద్ద ఉన్న విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్ ఈ టోర్నమెంట్‌లోనే అత్యుత్తమమైనదని అశ్విన్ కొనియాడారు. సాల్ట్, డేవిడ్, షెపర్డ్ , బెథెల్ వంటి నలుగురు పటిష్టమైన విదేశీ ఆటగాళ్లతో కూడిన టాప్ ఫోర్ కాంబినేషన్ ప్రత్యర్థి జట్లకు సవాల్‌గా మారుతుందని ఆయన అన్నారు. ఆరంభ మ్యాచ్‌ల్లో వెంకటేష్ అయ్యర్‌కు చోటు దక్కడం కష్టమేనని ఆయన అంచనా వేశారు.

Read Also: ముగిసిన పీఎస్ఎల్ 11 ట్రేడ్ విండో.. ఫైనల్ స్క్వాడ్స్ ఇవే!

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>