యుద్ధ ప్రభావంపై ప్రధాని మోదీ కీలక సమావేశం

కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) ఆర్థిక సలహా మండలి సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. భారత్‌పై యుద్ధ ప్రభావం తగ్గించే చర్యలపై సమాలోచనలు జరిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దేశ జీడీపీ మందగించకుండా ఏమేం చేయొచ్చనే అంశాలపై విశ్లేషించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరిచేందుకు సభ్యుల నుంచి ప్రధాని మోదీ అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించారు. గత నెలలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ అనేక కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించడం, బంగారాన్ని ఏడాది పాటు కొనుగోలు చేయకుండా ఉండటం, ఇంటి నుంచే పని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉండేందుకు ఏం చేయొచ్చనేది ప్రధాని మోదీ నిపుణులతో సమీక్ష చేశారు.

Read Also: గవర్నమెంట్​ జాబ్​ కంటే మిర్చి బండి బెటర్ : ఎంపీ రఘునందన్​ రావు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>