శుభ్‌మన్ గిల్‌కు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే స్థాయి ఇంకా రాలేదంటూ వెటరన్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప(Robin Uthappa) హాట్ కామెంట్స్ చేశాడు. ఇటీవల టెస్టులు, వన్డేలకు కెప్టెన్‌గా గిల్(Shubman Gill)ను నియమించారు సెలక్టర్లు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్.. అతి త్వరలోనే ఆ ఫార్మాట్‌లో కూడా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడన్న చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై ఊతప్ప స్పందించారు. ‘‘రోహిత్ శర్మ నుంచి వన్డే కెప్టెన్సీని తీసుకున్నప్పటికీ, అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని హ్యాండిల్ చేసే సత్తా గిల్‌కు ఇప్పట్లో లేదు. సమీప భవిష్యత్తులో అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా గిల్ కాలేడు’’ అని ఊతప్ప తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీ20 కెప్టెన్ అయ్యే అవకాశాలు శ్రేయాస్ అయ్యర్‌కు అధికంగా ఉన్నాయని పేర్కొన్నాడు.
‘‘టెస్ట్ క్రికెట్‌లో గిల్ చాలా మంచి ఆటగాడు. అది నేనూ ఒప్పుకుంటా. వన్డేల్లో కూడా బాగా రాణిస్తాడు. అతడి స్కోర్ బోర్డ్ కూడా బాగుంది. కానీ ఈ స్థాయి ఆటగాడికి ఇంకా మంచి గణాంకాలు ఉండాలి. సెలక్టర్లు టీ20లకు కెప్టెన్‌గా శ్రేయాస్(Shreyas Iyer)ను ఉంచాలని అనుకుంటున్నా. టీ20ల్లో తన స్థానాన్ని గిల్ ఇంకా సుస్థిరం చేసుకోలేదు. ఆసియా కప్-2025లో గిల్ సరిగా ఆడలేదు. దాంతో రెండో బ్యాటింగ్ స్లాట్ కోసం సంజూ శామ్‌సన్, యశస్వి జైస్వాల్ పోటీ పడుతున్నారు. టీ20 తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకోవడమే గిల్ ముందు ఉన్న ప్రథమ లక్ష్యం. అప్పటి వరకు అతడు కెప్టెన్ అవుతాడని నేను అనుకోవట్లేదు’’ అని ఊతప్ప(Robin Uthappa) చెప్పాడు. అంతేకాకుండా ఇండియాలో వైస్ కెప్టెన్సీకి పెద్దగా ప్రాధాన్యం లేదని, కొందరు వైస్ కెప్టెన్లు కెప్టెన్ కాకపోవడాన్ని మనం చూశామని గుర్తు చేశారు.

