బీహార్(Bihar) ఎన్నికల్లో ‘మహాఘట్‌బంధన్’ కూటమి తరపు సీఎం అభ్యర్థి ఎవరు? ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకాలం ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav).. సీఎం అభ్యర్థి అనే అంతా అనుకున్నారు. కానీ, తాజాగా కాంగ్రెస్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దీనిపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపై కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా మాట్లాడిన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్(Udit Raj).. తేజస్వీ యాదవ్ ఆర్‌జేడీ అభ్యర్థి అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ చర్చలకు దారితీశాయి. ‘‘తేజస్వీ యాదవ్ వాళ్ల పార్టీకి సీఎం అభ్యర్థి కావొచ్చు. కానీ ఇండి కూటమి తరుపున సీఎం అభ్యర్థి ఎవరు అనేది అంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం’’ అని ఉదిత్ అన్నారు. అయితే ఉదిత్ వ్యాఖ్యలపై ఆర్‌జేడీ ఇప్పటి వరకు స్పందించలేదు.
ఇటీవల సీఎం అభ్యర్థిత్వంపై తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజలే యజమానులు. సీఎంను వాళ్లే ఎన్నుకుంటారు. ఎవరు సీఎం అవ్వాలి? అని వాళ్లనే అడగండి. అప్పుడు సమాధానం మీకే వస్తుంది’’ అని అన్నారు.

