కలం, నిజామాబాద్ బ్యూరో: పంట రుణాన్ని తీర్చడానికి ఓ రైతు బ్యాంకుకు వచ్చాడు. డబ్బులు తీసి క్యాషియర్ కు ఇచ్చాడు. అయితే అతడు వాటిని మెషిన్ లో వేసి చూడగా అవి నకిలీవి (Fake Currency) అని తేలింది. దీంతో రైతుతో పాటు బ్యాంకు సిబ్బంది షాక్ అయ్యారు. ఈ ఘటన నిజామాబాద్(Nizamabad) జిల్లాలో చోటుచేసుకున్నది.
నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండల కేంద్రంలో నకిలీ నోట్ల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. జలాల్ పూర్ గ్రామానికి చెందిన రైతు చిన్న సాయిలు తన క్రాప్ లోన్ చెల్లించేందుకు కెనరా బ్యాంకుకు వచ్చాడు. అతడు మొత్తం 2 లక్షల 8,500 రూపాయలు తీసుకువచ్చాడు. మొత్తం 417 నోట్లు ఉండగా, క్యాషియర్ వాటిని మెషిన్‌లో పరిశీలించగా అన్నీ నకిలీవి (Fake Currency) గా తేలాయి.
దీంతో బ్యాంకు సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే బ్యాంకు మేనేజర్‌కు సమాచారం అందించారు. మేనేజర్ వర్ని పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వర్ని ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? రైతు చిన్న సాయిలుకు ఎలా అందాయి? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
Read Also: పవన్ కల్యాణ్ చొరవ.. కొండగట్టు ఆలయానికి రూ.30 కోట్లు
Follow Us On: Instagram


