కలం, వెబ్ డెస్క్: త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేయబోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్(KCR) కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరిలో కమిటీలు వేయాలని కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ‘పోరాడే స్పూర్తి ఉన్న యువకులతో పాటు అనుభవజ్ఞులను కూడా కలుపుకుని రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి కమిటీలు వేసుకుందాం‘ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. పగలు, పంచాయితీలు పక్కనబెట్టి అందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.
Read Also: పథకాల పేర్ల మార్పులో ఎన్డీఏ సర్కార్ రికార్డు!
Follow Us On: Sharechat


