కలం, వెబ్ డెస్క్ : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జనసేన ఎమ్మెల్యేలతో వరుస మీటింగ్స్ పెడుతున్నారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో వన్ బై వన్ మీటింగ్ పెడుతూ కీలక ఆదేశాలు ఇస్తున్నారు. సదరు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమస్యలు, అభివృద్ధి పనులపై సమావేశాలు నిర్వహిస్తున్నారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). పార్టీ పరమైన కార్యక్రమాలతో పాటు నియోజకవర్గాల అభివృద్ధి గురించి కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలుతో పాటు పెట్టుబడుల గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది.


