కలం వెబ్ డెస్క్ : దేశంలో, రాష్ట్రాల్లో ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు(Elections) రావడం, ప్రభుత్వాలు మారడం జరుగుతూనే ఉంటుంది. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం కోసం పని చేయడం ప్రభుత్వాల వంతు. అయితే ప్రస్తుతం హామీ ఇచ్చిన పథకాలు అందించడం కన్నా గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల పేర్ల మార్పు (Scheme Name Changes) పైనే పాలకులు శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Government) ముందు వరుసలో ఉంటుంది.
ఎన్డీఏ ప్రభుత్వం(NDA Government)లో మార్చిన పేర్లు:
2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి ఇటీవల జీ-రామ్-జీ బిల్లు(G RAM G Bill) వరకు అన్నీ ఆ కోవలోకే వస్తాయి. బీజేపీ నేతలు సైతం ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రాంతాల పేర్లు మారుస్తాం, పథకాల పేర్లు మారుస్తామంటూ బహిరంగంగానే హామీలు ఇస్తుంటారు. 2005లో రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పుతో తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు పేర్లు మార్చిన పథకాల గురించి చర్చ నడుస్తోంది. ఈ తీరు చూస్తుంటే ఎన్డీఏ ప్రభుత్వం పథకాల పేర్ల మార్పులతో రికార్డు సృష్టించేలా కనిపిస్తోంది. మరి ఆ పథకాలేంటో మీరూ చూసేయండి!
నిర్మల్ భారత్ అభియాన్ – స్వచ్ఛ భారత్ మిషన్
నేషనల్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ – మేక్ ఇన్ ఇండియా
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (BSBDA) – ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY)
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఫర్ LPG – పహల్(PAHAL) (LPG సబ్సిడీ బదిలీకి)
యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (UIP) – మిషన్ ఇంద్ర ధనుష్
రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన – దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన (DDUGJY)
నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్లాన్ – డిజిటల్ ఇండియా
నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ – భారత్ నెట్
యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ – ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY)
జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ (JNNURM) – అమృత్
నేషనల్ మారిటైమ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ – సాగర్‌మాల
స్వావలంబన్ యోజన (పెన్షన్ ) – అటల్ పెన్షన్ యోజన (APY)
జన్ ఔషధి స్కీమ్ (జెనరిక్ ఔషధాల సరఫరా) – ప్రధాన మంత్రి జన్ ఔషధి యోజన
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ – స్కిల్ ఇండియా
ఇందిరా ఆవాస్ యోజన – ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన
మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ – ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం (MGNREGA) – వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ)
ఈ పథకాలతో మరికొన్ని పథకాల పేర్లు కూడా మార్చారు.
Read Also: గుత్తి కోయల కోసం జాగృతి పోరాటం: కవిత
Follow Us On: Youtube


