కలం డెస్క్: వెంకటేష్ అయ్యర్(Venkatesh Iyer)ను ఆర్‌బీసీ భారీ డిస్కౌంట్‌కు భలే కొట్టేసిందంటూ ఆ జట్టు స్టార్ ఏబీ డివిలియర్స్(AB de Villiers) హాట్ కామెంట్స్ చేశాడు. డిసెంబర్ 16న జరిగిన ఐపీఎల్ వేలంలో వెంకటేష్‌ను ఆర్‌సీబీ రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే 2025 ఐపీఎల్‌లో వెంకటేష్‌కు కేకేఆర్ రూ.23.75 కోట్లు చెల్లించింది. ఇలా చూస్తే నిజంగానే ఆర్‌సీబీ భారీ డిస్కౌంట్‌లో వెంకటేష్‌ను కొనేసింది. దీనిపై స్పందించిన ఏబీ డివిలియర్స్.. వెంకటేశ్ అయ్యర్‌ను తక్కువ ధరకు దక్కించుకోవడం ఆర్‌సీబీకి భారీ లాభమని, ఇది వేలంలో చేసిన పెద్ద సైనింగ్ అని పేర్కొన్నాడు. అలాగే జోర్డన్ కాక్స్, మంగేష్ యాదవ్, జేకబ్ డఫీ వంటి ఇతర సైనింగ్‌లను కూడా ఏబీ ప్రశంసించాడు. అయితే జట్టులో ఒక మంచి రిస్ట్ స్పిన్నర్‌ను చేర్చుకుని ఉంటే మరింత బలంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
“ఆర్‌సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్. అందుకే విజయం తీసుకొచ్చిన కాంబినేషన్‌ను ఎక్కువగా మార్చకూడదనుకున్నారు. జోర్డన్ కాక్స్ మంచి సైనింగ్. అతడు బ్యాకప్‌గా ఉండొచ్చు. ఎంతవరకు ఆడతాడో తెలియదు కానీ చాలా ప్రతిభావంతుడైన యువ ఆటగాడు. వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) అయితే అసలు పెద్ద సైనింగ్. అతడిని చాలా తక్కువ ధరకు దక్కించుకున్నారు’’ అని ఏబీ చెప్పుకొచ్చాడు.
‘‘మంగేష్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. యశ్ దయాల్‌కు బ్యాకప్‌గా వచ్చాడు కానీ అంతకంటే ఎక్కువ పాత్ర పోషించే అవకాశం ఉంది. అలాగే జేకబ్ డఫీ జోష్ హాజిల్‌వుడ్‌కు మంచి బ్యాకప్. ఇది ఛాంపియన్ జట్టే. అయితే స్పిన్ విభాగంలో కొద్దిగా ఎక్స్ ఫ్యాక్టర్ లోపించింది. మరో రిస్ట్ స్పిన్నర్ ఉంటే బాగుండేది’’ అని అన్నాడు. అయినా ఆర్‌సీబీ(RCB) టైటిల్‌ను కాపాడుకునే అవకాశాలు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.
Read Also: ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్‌మనీకి భారీ బూస్ట్
Follow Us On: Instagram


