epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

యంగెస్ట్ సర్పంచ్ ఆన్ డ్యూటీ.. ఫస్ట్ ఫోకస్ వీటి మీదే!

కలం, వెబ్ డెస్క్: 21 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థిని కావలి నిఖిత వనపర్తి జిల్లా పెబ్బైర్ మండలం శాఖపూర్(వై) గ్రామం సర్పంచ్‌గా గెలిచింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల మూడో విడుతలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించింది. ప్రజాసేవ పట్ల నిబద్ధతకు గ్రామస్తుల నుండి విస్తృత ప్రశంసలు అందుకుంటోంది. పిన్న వయస్కుల్లో (Young Sarpanch) రాజకీయ జీవితం ప్రారంభించినవారిలో ఒకరిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం నాగర్ కర్నూల్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది నిఖిత. ఒకవైపు చదువు, మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తోంది.

నిఖిత తండ్రి రాజేంద్ర ప్రసాద్ రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దార్‌. తల్లి చిలకమ్మ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. నిఖిత ఒకప్పుడు రాజకీయాల్లో చేరాలని ఆశించినా సాధ్యంకాలేదు. తన మామ కావలి గోవిందు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి ఎంటరైంది. తన గ్రామానికి ప్రభుత్వ రవాణా సౌకర్యం లేదని, సర్పంచ్‌గా తన మొదటి అభ్యర్థన ఆర్టీసీ బస్సు (RTC Bus) సర్వీసు అని చెప్పారు. సైనిక్ స్కూల్ ఏర్పాటుచేయాలని యోచిస్తోంది.

“మా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి పైప్‌లైన్ కనెక్షన్లలో సమస్యలున్నాయి. నేను వాటిని పరిష్కరించాలనుకుంటున్నా. నాకు ప్రొఫెసర్లు, కళాశాల నుండి మద్దతు ఉంది. కాబట్టి నేను సర్పంచ్ పాత్రను సమర్థమంతంగా నిర్వహిస్తా. ఒక వైద్యురాలిగా మలేరియా, డెంగ్యూ ఇతర సమస్యలపై ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహిస్తా‘‘ అని అంటోంది నిఖిత (Nikitha).

Read Also: ఉపాధి హ‌క్కును దెబ్బ‌తీసేందుకు బీజేపీ కుట్ర : హ‌రీష్ రావు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>