కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి(Peddapalli) పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (Ekalavya School)ఏర్పాటు చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ (Gaddam Vamshi krishna) లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 2018–19 ఏడాదిలో ప్రారంభమైన ఈ పాఠశాలలు 2011 జనాభా లెక్కల ప్రకారం 50 శాతం ఎస్టీ జనాభా, 20వేల మంది ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో నాణ్యమైన విద్యాను అందించడానికి ఏకలవ్య రెసిడెన్సియల్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. నాలుగు జిల్లాలో ఎస్టీ జనాభా తక్కువ ఉన్న కారణంగా స్కూల్ ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది.
Read Also: నా మనవడిని మెస్సీ మ్యాచ్కు అందుకే తీసుకెళ్లా : సీఎం రేవంత్
Follow Us On: Instagram


