కలం, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) తీవ్ర ఎండల నేపథ్యంలో బిలాస్పూర్ (Bilaspur) రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఉపశమనం కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లపై రూఫ్‌టాప్ వాటర్ మిస్టింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సిస్టమ్ ద్వారా నీటి సన్నని పొగలా చల్లడం వల్ల ప్లాట్‌ఫామ్‌లపై ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీంతో వేడి తీవ్రత నుంచి ప్రయాణికులు కొంత మేరకు ఉపశమనం పొందుతున్నారు. తీవ్ర ఎండల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఈ ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా మారిందని అధికారులు తెలిపారు. వేసవి కాలంలో ప్రయాణికుల సౌకర్యం కోసం మరిన్ని స్టేషన్లలో కూడా ఇలాంటి సిస్టమ్ అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
-ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్లో రూఫ్-టాప్ వాటర్ మిస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన అధికారులు
– తీవ్ర ఎండల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గి సేదతీరుతున్న ప్రయాణికులుRoof-Top Water Misting System Installed at Bilaspur Railway Station in Chhattisgarh to Provide Relief… pic.twitter.com/2UAmRtmyaO
— Kalam Daily (@kalamtelugu) May 25, 2026
Read Also: మోహన్ బగాన్‌పై ఏఐఎఫ్ఎఫ్ ఫైర్.. ప్లేయర్ల విడుదలపై వివాదం
Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం

