Mobile Popup Ad
Mobile Popup Ad

బిలాస్‌పూర్ స్టేషన్‌లో మిస్టింగ్ సిస్టమ్.. ప్రయాణికులకు ఉపశమనం

కలం, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) తీవ్ర ఎండల నేపథ్యంలో బిలాస్‌పూర్ (Bilaspur) రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఉపశమనం కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లపై రూఫ్‌టాప్ వాటర్ మిస్టింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సిస్టమ్ ద్వారా నీటి సన్నని పొగలా చల్లడం వల్ల ప్లాట్‌ఫామ్‌లపై ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీంతో వేడి తీవ్రత నుంచి ప్రయాణికులు కొంత మేరకు ఉపశమనం పొందుతున్నారు. తీవ్ర ఎండల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఈ ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా మారిందని అధికారులు తెలిపారు. వేసవి కాలంలో ప్రయాణికుల సౌకర్యం కోసం మరిన్ని స్టేషన్‌లలో కూడా ఇలాంటి సిస్టమ్ అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Read Also: మోహన్ బగాన్‌పై ఏఐఎఫ్ఎఫ్‌ ఫైర్.. ప్లేయర్ల విడుదలపై వివాదం

Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>