Mobile Popup Ad
Mobile Popup Ad

కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? ఈ ఫీచర్లను అసలు మిస్ అవ్వొద్దు!

కలం, వెబ్‌డెస్క్: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో విద్యార్థులు, ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లకు ల్యాప్ టాప్‌ లు  ప్రధానంగా మారాయి. ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్, ప్రాజెక్టులు, వీడియో ఎడిటింగ్ వంటి పనుల కోసం చాలామంది ల్యాప్‌టాప్‌ను ఉపయోగించాల్సి వస్తుంది. టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ రోజుల్లో ల్యాప్ టాప్ కొనేందుకు (Laptop Buying) అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే ల్యాప్ టాప్‌ను కొనుగోలు చేసేటపుడు ఏది తీసుకోవాలో స్పష్టంగా తెలియకపోతే ఎంపిక చేయడం కష్టంగా ఉంది.

అందుకే కొనుగోలు చేసే ముందు ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్, బడ్జెట్, బ్రాండ్ గురించి కొంత అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం మనకు మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు, మోడళ్లు ఉండటంతో సరైన ల్యాప్‌టాప్ ఎంపిక చేయడం (Laptop Buying) కొంత కష్టంగా మారింది. కేవలం ధర చూసి కొనకుండా, అవసరాలకు తగ్గ ఫీచర్లను పరిశీలించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం.

ప్రాసెసర్ (Processor)

ల్యాప్‌టాప్‌లో ముఖ్యమైన భాగం ప్రాసెసర్. సాధారణ పనులు, ఆన్‌లైన్ క్లాసులు, బ్రౌజింగ్ కోసం Intel i3 లేదా Ryzen 3 సరిపోతాయి. మల్టీటాస్కింగ్, కోడింగ్, డిజైన్ పనుల కోసం Intel i5 లేదా Ryzen 5 మంచివి. వీడియో ఎడిటింగ్, హెవీ గేమింగ్ వంటి పనులకు Intel i7 లేదా Ryzen 7 లాంటి పవర్‌ఫుల్ ప్రాసెసర్లు అవసరం.

SSD స్టోరేజ్ (SSD Storage)

ప్రస్తుతం కనీసం 8GB RAM ఉన్న ల్యాప్‌టాప్ కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ పనులు చేసే వారికి 16GB RAM మంచి ఎంపిక. అలాగే SSD స్టోరేజ్ ఉన్న ల్యాప్‌టాప్ తీసుకుంటే సిస్టమ్ వేగంగా పనిచేస్తుంది. కనీసం 512GB SSD ఉండటం మంచిది.

యాంటీ-గ్లేర్ స్క్రీన్ (Anti-glare screen)

సాధారణ వినియోగానికి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సరిపోతాయి. కానీ గేమింగ్, వీడియో ఎడిటింగ్, 3D డిజైన్ పనుల కోసం ప్రత్యేక గ్రాఫిక్స్ కార్డ్ అవసరం. అలాగే Full HD డిస్‌ప్లే, యాంటీ-గ్లేర్ స్క్రీన్ ఉంటే కళ్లకు ఒత్తిడి తగ్గుతుంది.

బ్యాటరీ బ్యాకప్ (Battery Backup)

తరచూ బయటకు తీసుకెళ్లే వారికి తక్కువ బరువు, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉన్న ల్యాప్‌టాప్ ఉపయోగకరం. కనీసం 6 నుంచి 8 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటే మంచిది. USB Type-C, HDMI, Wi-Fi 6 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలి.

వారంటీ (warranty)

ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే ముందు వారంటీ, సర్వీస్ సెంటర్ సదుపాయం ఉందా తెలుసుకోవాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొంచెం మెరుగైన స్పెసిఫికేషన్లు ఉన్న మోడల్ తీసుకుంటే ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు.

Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం 

Read Also: కుదుళ్లలో దురద, చుండ్రు వేధిస్తున్నాయా?..ఈ టిప్స్ మీకోసమే!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>