కలం వెబ్‌డెస్క్: కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నాణ్యతా లోపం వెరసి కోట్లాది రూపాయల ప్రజాధనం నదిలో కలిసిపోయింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్‌పల్లి గ్రామ శివారులో మానేరు నది(Maneru River)పై నిర్మించిన చెక్ డ్యామ్ (Check Dam) ఒక్కసారిగా కుప్పకూలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 39.82 కోట్లతో 2022లో నిర్మించిన ఈ డ్యామ్ సుమారు 100 మీటర్ల మేర నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో స్థానిక రైతులు, గ్రామస్థులలో తీవ్ర ఆందోళన నెలకొంది. నీటి నిల్వ కోసం నిర్మించిన ఈ డ్యామ్ కూలిపోవడంతో సాగు నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డ్యామ్ నీటిలో కొట్టుకుపోయి, నీరు దిగువకు పారుతుండడం గమనించిన గ్రామస్థులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
ఈ చెక్ డ్యామ్ (Check Dam) నిర్మాణం 2022లో ప్రారంభమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రూ. 39.82 కోట్ల నిధులతో నిర్మాణ పనులు చేపట్టారు. మానేరు నది(Maneru River)లో నీటి నిల్వ పెంచి, స్థానిక రైతులకు సాగు నీరు అందించడం, భూగర్భ జలాలు పెంచడం ఈ డ్యామ్ ప్రధాన ఉద్దేశం. అయితే, మూడేళ్లలోనే డ్యామ్ కుప్పకూలడంతో నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read Also: గండిపేట చెరువులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు
Follow Us On: Instagram


