కలం వెబ్ డెస్క్ : నాంపల్లి సీబీఐ కోర్టు(Nampally Court)కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు నుంచి అందరిని బయటికి పంపి తనిఖీలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లి కోర్టులో బాంబు పేలుస్తున్నామంటూ ఉదయం 11 గంటల ప్రాంతంలో దుండగులు ఈమెయిల్ పంపించారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం కోర్టులో జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బందిని హుటాహుటిన బయటకు పంపించారు.
బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు మొత్తం తనిఖీ చేపట్టారు. కానీ, బాంబు ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. సైబర్ పోలీసులు ఈ బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బెదిరింపులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో సైతం కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Read Also: పెద్దపల్లి జిల్లాలో కుప్పకూలిన చెక్ డ్యామ్
Follow Us On: Pinterest


