కలం, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి కారణంగా సుమారు 15 మంది మరణించారు. చాలా మరణాలకు స్క్రబ్ టైఫస్‌తో పాటు దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఇతర సమస్యలు కూడా కారణమని వైద్యులు తెలిపారు. ఈ రోజు అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని మోడల్ కాలనీకి చెందిన 65 ఏళ్ల మంగమ్మ అనే వృద్ధురాలు స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) తో మరణించింది. జ్వరంతో బాధపడుతూ తిరుపతి ఆర్యూయే ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.
Read Also: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Follow Us On: Youtube


