epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ప్రతి ఏడాది.. 5 లక్షల రోడ్డు ప్రమాదాలు, 1.8 లక్షల మంది మరణాలు

కలం, వెబ్ డెస్క్: దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు(Road Accidents) పెరిగిపోతున్నాయి. ప్రమాదాల్లో యువతే అధికంగా ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, సగటున 1.8 లక్షల మంది మరణిస్తున్నారని నితిన్ గడ్కరీ రాజ్యసభకు తెలియజేశారు. వీటిలో 66% మరణాలు యువకులలో (18 నుండి 34 సంవత్సరాల వయస్సు) జరుగుతున్నాయి.

కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు గడ్కరీ సమాధానమిస్తూ.. రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, మరణాల సంఖ్యను తగ్గించడంలో ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ కాలేదని అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వం (Central Govt) రాష్ట్రాలకు ఆధునిక అంబులెన్స్‌లను అందించాలని యోచిస్తోందని గడ్కరీ పేర్కొన్నారు. ఈ ప్రణాళిక ప్రకారం అంబులెన్స్‌లు ప్రమాద స్థలానికి 10 నిమిషాల్లో చేరుకుంటాయి. ఐఐఎం చేసిన అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ.. గాయపడినవారికి సకాలంలో చికిత్స అందితే, 50,000 మంది ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అన్నారు.

గత ఐదు సంవత్సరాలలో ఆమోదించబడిన 574 జాతీయ రహదారి ప్రాజెక్టులు షెడ్యూల్ కంటే వెనుకబడి ఉన్నాయని గడ్కరీ రాజ్యసభకు తెలియజేశారు. వాటి మొత్తం వ్యయం దాదాపు 3.60 లక్షల కోట్ల రూపాయలు. అలాగే ఫాస్ట్ ట్యాగ్, నంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికత ద్వారా వాహనం ఆపకుండానే టోల్ (Toll) తీసివేయబడుతుంది. దీనివల్ల రూ.1,500 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుంది. రూ.6,000 కోట్ల అదనపు ఆదాయం పెరుగుతుంది. గతంలో టోల్ గేట్స్ దాటడానికి 3-10 నిమిషాలు పట్టేది, ఇప్పుడు ఈ సమయాన్ని సున్నాకి తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.

Read Also: ఏపీలో స్క్రబ్ టైఫస్ తో మ‌రో మ‌హిళ మృతి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>