Mobile Popup Ad
Mobile Popup Ad

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్లైట్ జ‌ర్నీలు.. జ‌న‌సేన కీల‌క ప్ర‌క‌ట‌న‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) ఫ్లైట్ జ‌ర్నీల‌పై జ‌న‌సేన (Janasena) పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జనసేన పార్టీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో పవన్ కల్యాణ్ ప్రభుత్వ, వ్యక్తిగత పర్యటనల కోసం ఉపయోగించే హెలికాప్టర్, ఫ్లైట్ ఖర్చులపై వివరణ ఇచ్చింది. పవన్ వినియోగించే హెలికాప్టర్, ఫ్లైట్‌కు అయ్యే ఖర్చులో ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్ము నుంచి ఖర్చు చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ ఖర్చులన్నీ ఆయన సొంతంగా భరిస్తున్నారని పేర్కొంది.

అలాగే తాడేపల్లి నుంచి లండ‌న్‌కు ప్రత్యేక విమానాలు, తాడేపల్లి నుంచి అమరావతికి కూడా హెలికాప్టర్లు వాడుకునే వారికి తమ అధినేతకు ఉన్న తేడా ఇదేనంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై (YS Jagan) జనసేన విమర్శలు గుప్పించింది. ప్రజల డబ్బును దుర్వినియోగం చేయకుండా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని ఆ పోస్టులో పేర్కొంది. వైసీపీ ఇప్ప‌టికే ప్ర‌భుత్వాధినేత హెలీ కాఫ్ట‌ర్ ప్ర‌యాణాల‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తోంది. మ‌రో వైపు రేపు ప‌వ‌న్ రాజ‌మండ్రిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన జ‌గ‌న్ పార్టీకి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది.

Read Also: మోదీని కుటుంబంతో క‌ల‌వ‌డం నా అదృష్టం: రామ్మోహ‌న్ నాయుడు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>